![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి' . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -319 లో.. మురారి మాములు సిచువేషన్ లోకి రాగానే మురారితో కృష్ణ సరదాగా మాట్లాడేసరికి మురారి ఎప్పటిలాగే అవుతాడు. ఆ తర్వాత మిమ్మల్ని నేను చదివించాను కదా అందుకు ప్రతిఫలంగా నేను ఒకటి అడుగుతానని మురారి అనగానే... ఏంటని కృష్ణ అడుగుతుంది.
నువ్వు ఈ ఇంట్లోనే ఉండు అని మురారి అంటాడు. ఇప్పుడు మీరు పిలిస్తే పలికేంత దగ్గర ఉన్నాను కాదా అని కృష్ణ అనగానే.. చూస్తే కనపడేంత దగ్గర ఉండాలని మురారి అంటాడు. మీరు అమెరికా వెళ్లి వచ్చాక అప్పుడు మీకు గతం గుర్తుకు వస్తుంది. అప్పుడు మీ పక్కనే ఉంటానని కృష్ణ మురారికి చెప్తుంది. మరొకవైపు వాళ్ళ మాటలు అన్ని ముకుంద వింటుంది. కృష్ణ భవాని దగ్గరికి వచ్చి.. మీరేం టెన్షన్ పడకండి. ఏసీపీ సర్ ఇప్పుడు సెట్ అయ్యారని కృష్ణ చెప్తుంది. నాకు చిరాకుగా ఉంది. తనని ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పమని రేవతికి భవాని చెప్తుంది. " నన్ను ఏసీపీ సర్ ఇక్కడే ఉండమని అంటున్నారు కానీ నేను ఒప్పుకోలేదు అది మీకు నేనిచ్చే రెస్పెక్ట్" అని భవానితో కృష్ణ అంటుంది. ఇప్పుడు ఒక్క మాట అత్తయ్య అని మిమ్మల్ని పిలిస్తే ఏసీపీ సర్ కి నిజం తెలిసిపోతుంది కానీ నేను అలా చెయ్యనని కృష్ణ చెప్తుంది. నా మాటకి విలువ ఇస్తున్నానని నటించకు. అలా పిలిస్తే అవుట్ హౌస్ నుండి పంపిస్తానని నీకు భయమని భవాని అంటుంది.
మరొకవైపు శకుంతలకి కృష్ణ జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత లాయర్ ఫోన్ చేసిండని శకుంతల చెప్పగానే.. అవునా మనం వెళ్లి చిన్నాన్నని అసలు ఏం జరిగింది? చెయ్యని తప్పు ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాడో తెలుసుకోవాలని కృష్ణ అంటుంది. మరొకవైపు డ్రింక్ చేసి మధు ఎలాగైనా మురారికి నిజం చెప్పాలని అనుకుంటాడు. ఆ తర్వాత భవాని వచ్చి డ్రింక్ చేసి ఉన్న మధు చెంప చెల్లుమనిపిస్తుంది. మరొకవైపు కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. సరదాగా కృష్ణతో కబుర్లు చెప్తూ కృష్ణ ఒడిలో నిద్రపోతాడు. ఉదయo నిద్రలేచిన మురారిని వాళ్ళ ఇంటికి పంపిస్తుంది కృష్ణ. తరువాయి భాగంలో మనం ఎన్ని రోజులు అమెరికాలో ఉంటామని ముకుందని మురారి అడుగుతాడు. అమెరికా వెళ్ళడం ఎందుకు? అక్కడ నాకు ట్రీట్ మెంట్ ఇచ్చే డాక్టర్ నెంబర్ ఇస్తే కృష్ణ మాట్లాడుతుందని మురారి అంటాడు. మంచి పని. ఇప్పుడు అక్క నెంబర్ ఇస్తే ముకుంద ప్లాన్ సక్సెస్ అవ్వదని రేవతి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |